Saturday, March 28, 2009

Warm welcome to pawan kalyan in Guntur district

సామాజిక అసమానతలే నక్సలిజానికి కారణం
చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకున్న పల్నాడులో సామాజిక అసమానతలు రాజ్యమేలుతున్నాయి. ఇలాంటి అంతరాలు ఉండటం కారణంగానే నక్సలిజ వ్యాప్తికి పల్నాడు వేదికగా మారిందని యువరాజ్యం అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. పల్నాడు ప్రాంతంలో వినుకొండ, గురజాల, మాచర్ల నియోజకవర్గాలలో రెండు రోజుల పాటు పర్యటన కార్యక్రమాన్ని చేపట్టిన ఆయన తొలి రోజు వినుకొండ, గురజాల నియోజకవర్గాలలో పర్యటించారు. సామాజక దృక్కోణం, సామ్యవాద భావాలు ఉన్న పవన్‌ కళ్యాణ్‌ ప్రసంగం యావత్తు బడుగు వర్గాల జీవన స్థితిగతుల మీదనే కొనసాగింది.

వినుకొండలో అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం ఆయన అక్కడికి చేరుకున్నారు. అనంతరం పట్టణంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏ రాజకీయ పార్టీలు పట్టించుకోవటం లేదన్నారు. సమసమాజ స్థాపన కోసం కృషి చేయాల్సిన పార్టీలు తన స్వప్రయోజనాల కోసం రాజకీయాలను నడుపుతున్నారన్నారు. ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా చేసుకొని ప్రజారాజ్యం అవతరించిందన్నారు. వచ్చే టప్పుడు ఏమీ తీసుకురాలేదని, పోయే టప్పుడు ఏమీ తీసుకొని పోలేమని ఆయన అన్న వ్యాఖ్యలు అందరినీ ఆలోచింపజేశాయి. సామ్యవాదానికి 11 శతాబ్దంలోనే పల్నాడులో బీజాలు పడినప్పటికీ అది కేవలం చెప్పుకోవటానికే మిగిలి పోయిందన్నారు. కానీ అంతరాలు పెరిగిపోయాయన్నారు. ఆర్ధిక, సామాజిక, రాజకీయ కోణంలో పరికిస్తే దశాబ్ద కాలంగా ఈ ప్రాంతం వెనుక బడి పోయిందన్నారు. ప్రజారాజ్యం పార్టీ అధికారంలోకి వస్తే పల్నాడుపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.

ఈ సందర్భంగా పర్యటనలో ఈపూరు మీదుగా కారంపూడికి చేరుకున్నారు. కారంపూడిలో ఆయన ప్రసంగం స్థానిక సమస్యలపై కొనసాగింది. జిల్లాకు మాకు కుటుంబానికి ప్రత్యేకమైన అనుబంధం ఉందన్నారు. అంబేద్కర్‌ ఆశయాలకు అనుగుణంగా తమ పార్టీ ప్రయాణం కొనసాగుతుందన్నారు. మధ్యలో ఆయన జూలకల్లు, జానపాడు గ్రామాలలో దళిత పల్లెలను సందర్శించి వారి సమస్యలను తెలుసుకున్నారు. స్థానిక సమస్యలే ఎజెండాగా పవన్‌ పర్యటన కొనసాగింది. వినుకొండలో ఆయన వచ్చినప్పుడు అంతగా ప్రజలు లేకపోవటం విశేషం. ఈపూరు, కారంపూడి, జానపాడు, జూల ల్లు, పిడుగురాళ్ల, దాచేపల్లి తదితర ప్రాంతాలలో ప్రజలు ఆయన చూసేందుకు తరలివచ్చారు. ప్రజారాజ్యం పార్టీ నాయకులు, యువరాజ్యం ప్రతినిధులు ఆయన రాక సందర్భంగా భారీగా జనసమీకరణ చేశారు. గురజాల నియోజకవర్గంలో టిక్కెట్‌ ఆశిస్తున్న ఆశావహులు పోటీపడి జన సమీకరణ చేశారు. కారంపూడి, జూలకల్లు, పిడుగురాళ్ల ప్రాంతాలలో రెడ్డి సామాజిక వర్గానికి టిక్కెట్‌ ఇవ్వకూడదని, ఎస్‌సి వర్గాలు అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో వారికే సీటు కేటాయించాలని ప్లేకార్డులు ప్రదర్శించటం కన్పించింది.

పల్నాడులో ఉప్పొంగిన జన కెరటం....

పల్నాడులో పవన్‌ కళ్యాణ్‌ పర్యటనకు ప్రజలు విశేషంగా తరలివచ్చారు. ఆయన దృష్టిలోపడటానికి టిక్కట్‌ను ఆశిస్తున్న కాయితి నర్సిరెడ్డి, వరికూటి అశోక్‌బాబు, నంద్యాల ధనుంజయరెడ్డి, దేశినేని కళ్యాణిదేవి, గుర్రం గోపీశ్రీధర్‌, మందా బెంజిమన్‌, భవనాశి యల్లారావు, లోకిరెడ్డి ఆంజనేయులురెడ్డిలు భారీగా జనసమీకరణ చేశారు. కారంపూడి నుండి భారీగా ఆయన కాన్వాయ్‌ని అనుసరిస్తూ ర్యాలీగా తరలివచ్చారు. పిడుగురాళ్లలో ఆయన రాక కోసం సాయంత్రం నాలుగు గంటల నుండి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎదురుచూశారు. మొత్తం మీద పవన్‌ కళ్యాణ్‌ పల్నాడు మొదటి రోజు పర్యటన విజయవంతమైంది

who is candidates for PRP in Guntur

జిల్లాలో లోక్‌సభ, శాసనసభకు ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీచేసే అభ్యర్ధుల జాబితాలను ఖరారు చేసే విషయంలో అధిష్టానానికి ఇంకా స్పష్టత రాలేదని తెలిసింది. ప్రదానంగా గుంటూరు, బాపట్ల పార్లమెంట్‌ స్థానాలపై కొంతమేరకు స్పష్టత సాధించినా నర్సరావుపేట విషయంలో ఇంకా అభ్యర్ధి ఎంపికపై నిర్ణయం తీసుకోలేదంటున్నారు. పార్లమెంట్‌కు సంబంధించి గుంటూరు లోక్‌సభకు తోట చంద్రశేఖర్‌, బాపట్లకు నూతక్కి రామారావులను ఖరారు చేసినా తొలిజాబితాలో అవకాశం దక్కకపోవడం వారిని విస్మయానికి గురిచేసింది. అలాగే అసెంబ్లీ అభ్యర్ధుల ఎంపికవిషయంలో కూడా మరో రెండు రోజుల జాప్యం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రదానంగా ఎనిమిది నియోజకవర్గాల్లో అభ్యర్ధుల ఎంపికపై ఇంకా స్పష్టత రాలేదు. బాపట్ల, రేపల్లె, వేమూరు, ప్రత్తిపాడు, నర్సరావుపేట, వినుకొండ, చిలకలూరిపేట, మాచర్ల అభ్యర్దుల ఎంపికపై కొంత గందరగోళం నెలకొంది. గుంటూరు నగరంలోని తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల అభ్యర్దుల ఎంపికలో కూడా ఆఖరి నిమిషంలో ఉత్కంఠ తప్పేలా లేదు. గుంటూరు తూర్పు నుంచి జియావుర్‌ రెహమాన్‌, షేక్‌ షౌకత్‌ పేర్లు ప్రదానంగా వినిపిస్తున్నాయి. మైనార్టీయేతర అభ్యర్ధిని ఎంపికచేయాలని కూడా అధిష్టానంపై ఒత్తిడి వచ్చింది. కానీ మైనార్టీలకే అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం.

గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కిలారి రోశయ్య లేక తులసి రామచంద్రప్రభు పేరు తెనాలిలో కూడా పరిశీలనలో ఉంది. సత్తెనపల్లికి దిలీప్‌ చక్రవర్తి, నర్సరావుపేటకు మిట్టపల్లి కోటేశ్వరరావు పేర్లు వినిపిస్తున్నాయి. మంగళగిరికి చంటి లేక ఉడతాపెద్దన్న పేర్లు పరిశీలిస్తున్నారు. మహిళా కోటాలో తమ్మిశెట్టి జానకీదేవి పేరు కూడా పరిశీలనలో ఉంది. పొన్నూరులో తాళ్ళ వెంకటేష్‌ పేరు దాదాపు ఖరారైనా ఆఖరి నిమిషంలో మార్పుజరుగుతుందని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఈ నియోజకవర్గంపై పోసాని కృష్ణమురళి, కోటా శ్రీనివాసరావును కూడా అధిష్టానం వద్ద తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. జిల్లాలోని పెదకూరపాడు, తాడికొండ, పత్తిపాడు నియోజకవర్గాల్లో అభ్యర్ధుల ఎంపికలో మల్లగుల్లాలు పడుతున్నారు.

Rosayiah comments on PRP and TDP

సెమీఫైనల్‌లో గెలిచాకే మాతో పోటీ పడాలి : రోశయ్య
టిడిపి, పిఆర్‌పిలు సెమీఫైనల్‌లో తలపడి ఎవరు గెలుస్తారో వారే తమకు ఈ ఎన్నికల్లో పోటీగా నిలుస్తారని ఆర్థిక మంత్రి కె.రోశయ్య వెల్లడించారు. ఈ ఎన్నికల్లో మీకు ప్రధానపోటీ ఎవరూ అన్న ప్రశ్నకు ఆయన పై విధంగా సమాధానమిచ్చారు. ముందుగా సెమీఫైనల్‌లో టిడిపి, పిఆర్‌పిలు పోటీపడి వాటిలో ఏదో ఒకటి గెలువాలి, ఆ తరువాత గెలిచిన పార్టీ ఫైనల్‌గా తమతో పోటీ పడాలని ఆయన చమత్కరించారు. శనివారంనాడిక్కడ సిఎల్‌పి కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మంత్రి కె.రోశయ్య మాట్లాడారు. కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రకటనతోనే తమ పార్టీ తొలి విజయాన్ని నమోదు చేసుకుంటే, ప్రశాంత నామినేషన్లతో మరో విజయాన్ని చేజెక్కించుకుందన్నారు. మహా కూటమిలో ఇంతవరకు అభ్యర్థుల ప్రక్రియే తేలలేదన్నారు.

ఒక ప్రాంతానికే పరిమి తమైన టిఆర్‌ఎస్‌ సైతం సీట్ల కేటాయింపులో తర్జనభర్జనలు పడుతోందని విమర్శిం చారు. ఒకరు రూ.10 కోట్లించామంటే మరోకరు రూ.4 కోట్లు ఇచ్చామని ఆయా పార్టీల అభ్యర్థులు చెప్పుకుంటున్నారని ఆయన విమర్శించారు. మహాకూటమికి ఉమ్మడి అజెండాయే లేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్‌ను ఓడించాలనే ఏకైక అజెండాతో ఆయా పార్టీలు ముందుకెళ్తున్నా యని ధ్వజమెత్తారు. కమ్యూనిస్టులు తమ ప్రభల్యం తగిన విషయాన్ని గుర్తించుకున్నారేమోనని రోశయ్య అన్నారు. అందుకే తమ బలానికి తగట్టుగా పోటీకి దిగే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. గతంలో అభ్యర్థుల జాబితా ప్రకటిస్తే కాంగ్రెస్‌లో ఎంతో గందరగోళం ఉండేదన్ని అన్నారు. ప్రస్తుతం ఆ రకమైన వాతావరణం కాంగ్రెస్‌లో లేదని ఆయన పేర్కొన్నారు. కొన్ని అసంతృప్తులు ఉన్నా వారు కేవలం అధిష్టానానికి వినతులు చేసేందుకు పరిమితమయ్యారని చెప్పారు. జూనియర్‌ ఎన్‌టిఆర్‌ త్వరగా కోలుకోవాలని కోరారు

TDP fouth list of candidates

శనివారం అర్ధరాత్రి 2.45 నిమిషాలకు తెలుగుదేశం పార్టీ నాలుగో జాబితాను విడుదల చేసింది. నాలుగు లోక్‌సభ, 28 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు టీడీపీ మొత్తం 174 అసెంబ్లీ, 26 లోక్‌సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది.
లోక్‌సభ అభ్యర్థులు

రాజమండ్రి - మాగంటి మురళీమోహన్‌

హిందూపురం - నిమ్మల కిష్టప్ప

రాజంపేట - లక్కిరెడ్డి రమేష్‌కుమార్‌ రెడ్డి

నర్సాపురం - తోట సీతామహాలక్ష్మి


అసెంబ్లీ అభ్యర్థులు

ఖానాపూర్‌ - సుమన్‌ రాథోడ్‌

అదిలాబాద్‌ - జోగు రమణ

ముధోల్‌ - డాక్టర్‌ వేణుగోపాల చారి

మలక్‌పేట - ముజఫర్‌అలీ

శేరిలింగం పల్లి - మువ్వా సత్యనారాయణ

వనపర్తి - రావుల చంద్రశేఖర్‌

మల్కాజిగిరి - శారదా మహేష్‌

ఇచ్చాపురం - ప్రియా సాయిరాజ్‌

ములుగు - సీతక్క

ఇల్లెందు - ఊకే అబ్బయ్య

ఎచ్చెర్ల - నాయిని సూర్యనారాయణరెడ్డి

విశాఖ (తూర్పు) - వెలగపూడి రామకృష్ణబాబు

విశాఖ (ఉత్తరం) - జయ

అరకు - ఎస్‌ సోమ

అనకాపల్లి - దాడి వీరభద్రరావు

కాకినాడ (రూరల్‌) - పిల్లి అనంత లక్ష్మి

యలమంచిరి - లాలం భాస్కరరావు

నిడదవోలు - బూరుగుపల్లి శేషారావు

ముమ్మిడివరం - నడింపల్లి శ్రీనివాసరాజు

దెందులైరు - చింతమనేని ప్రభాకర్‌

ఆవనిగడ్డ - అంబటి బ్రాహ్మణయ్య

చింతలపూడి - డాక్టర్‌ రాజారావు

మంత్రాలయం - బాల నాగిరెడ్డి

గుంతకల్‌ - సాయినాథ్‌గౌడ్‌

మైలవరం - దేవినేని ఉమామహేశ్వరరావు

జూబ్లీహిల్‌‌స - మహ్మద్‌ సలీం

కల్యాణదుర్గం - ఉన్నం హనుమంతరాయ చౌదరి

Maximun seats will give to women candidates

తొలి జాబితాలో బీసీలకు పెద్దపీట వేసిన ప్రజారాజ్యంపార్టీ రెండో జాబితాలో మహిళలకు ప్రాధాన్యత ఇస్తామని పార్టీ అధినేత చిరంజీవి అన్నారు. కాకినాడలో ఆయన శనివారం మీడియా మాట్లాడుతూ కౌన్సిల్‌లోను మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. పీఆర్పీ అధికారంలోకి వ…చ్చిన వెంటనే 100కు వంటసరుకు పథకం ఫైలుపై తొలి సంతకం చేస్తామని చిరు హామి ఇచ్చారు. అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి అల్లు అరవింద్‌ పోటీ చేస్తారని ఆయన చెప్పారు. టికెట్ల కేటాయింపులో అసమ్మతి సహజమేనని, అయితే టికెట్‌ రానివారు ఆందోళన చేయకుండా పార్టీ పటిష్టతకు కృషి చేయాలని చిరు కార్యకర్తలను కోరారు.

TRS lokshaba candidates list

టీఆర్‌ఎస్‌ లోకసభ అభ్యర్థుల జాబితా

1. మహబూబ్‌ నగర్‌ ----- కె. చంద్రశేఖర రావు
2. మెదక్‌ --------------- విజయశాంతి
3. నాగర్‌ కర్నూలు----- జి. బాలరాజు
4. సికింద్రాబాదు ------ ఎన్‌ వెంకట్‌ రెడ్డి
5. వరంగల్‌ --------- ఆర్‌. పరమేశ్వర్‌
6. కరీం నగర్‌ -------- వినోద్‌ కుమార్‌
7. పెద్దపల్లి ----------- దోమన శ్రీనివాసరావు
8. జహీరాబాద్‌ -------- సయ్యద్‌ యూసూఫ్‌ అలి
9. నిజామాబాదు -------- బి. గణేష్‌ గుప్తా

Bomb attack on PRP candidate

అనంతపురంలో ప్రజారాజ్యం పార్టీలో అసంతృప్తి సెగలు బాంబుల దాడి వరకు వెళ్లింది. అనంత అసెంబీకి పీఆర్పీ టికెట్‌ దక్కించుకున్న టీ.జే. ప్రకాష్‌ కారుపై గత అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు బాంబులతో దాడులు చేశారు. ఆ సమయంలో ఆయన పార్టీ కార్యాలయంలో ఉండటంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. అయితే ఈ ఘటనపై ప్రకాష్‌ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ జరుపుతామని, ప్రకాష్‌కు భద్రత కల్పిస్తామని ఎస్పీ హామి ఇచ్చారు

prajarajyam second list of candidates

పీఆర్‌పీ రెండో జాబితా
పీఆర్‌పీ రెండో జాబితా విడుదల చేసింది. మొత్తం 12 లోకసభ, 60 అసెంబ్లీ స్థానాలకు పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో కూడా అన్ని వర్గాలకు సమాన పీట వేసింది.


లోకసభ స్థానాలు
1.పెద్ద పల్లి ------- ఆరేపల్లి డేవిడ్‌ రాజ్‌ (ఎస్సీ)
2. నిజామాబాదు ------ డా. పుంజల వినయ్‌ కుమార్‌ (బీసీ)
3. సికింద్రాబాదు ------- డా. దోసోజి శ్రవణ్‌ కామార్‌ (బీసీ)
4. నాగర్‌ కర్నూలు ----- డీ. సతీష్‌ మాదిగ (ఎస్సీ)
5. నల్గొండ ------ పాదూరి కరుణ (ఓసీ)
6. భువనగిరి ------- గడ్డ చంద్రమౌళి (బీసీ)
7. గుంటూరు ------- చంద్రశేఖర్‌ (ఎస్సీ)
8. నర్సరావు పేట ----- సయ్యద్‌ సాహెబ్‌ (మైనారిటీ)
9. నంద్యాల ------- భూమా నాగిరెడ్డి (ఓసీ)
10.అనంతపురం ------- జిఎస్‌ మునుసూబ్‌ (మైనరిటీ)
11 కడప ------- ఎస్‌ఏ ఖలీల్‌ పాష
12. తిరుపతి ------ ఉలిగేపల్లి వరప్రసాద్‌ (ఎస్పీ)

అసెంబ్లీ స్థానాలు
హైదరాబాద్‌
1.ముషీరాబాద్‌ ------ విపీ అశోక్‌
2. ఖైరతాబాద్‌ ------- నవ్వాడ విజేంద్ర
3. గోషామహల్‌ ----- మాదవీదీపక్‌
4. యాఖుత్‌ పుర ----- షీరా రాజ్‌కుమార్‌
5. బహదూర్‌ పుర ---- సయద్‌ యూనిస్‌ దేశ్‌ముఖ్‌
6. సికింద్రాబాదు ---- మేకల సారంగపాణి
మహబూబ్‌నగర్‌
7. నారాయణ్‌పేట ---- డా. సాయిబాబ‚
8. వనపర్తి ---- డా. భూపేష్‌ ముదిరాజ్‌
9.గద్వాల ----- గట్టు భీముడు
10. అలంపూర్‌ ---- సురవ శోభారాణి
11. నాగర్‌ కర్నూలు ----- డా. షేక్‌ నూర్జహాన్‌
12. కల్వకుర్తి ----- జక్కుల చిత్తరంజన్‌ దాస్‌
మెదక్‌
13. సిద్దిపేట ------------ డా. పెగ్గలం నరసింహాచారి
14. నారాయణ్‌ ఖేడ్‌------------- ఎం. విజయబాల్‌ రెడ్డి
15. నర్సాపూర్‌ ---------- ఖైలాస్‌ రాంచంద్ర గుప్తా
16. జహీరాబాద్‌ ---------------- టి. వసంత కుమార్‌
వరంగల్‌
17. జనగాం --------------- జెల్లి సిద్దయ్య
18. స్టేషన్‌ గణపూర్‌ ---------- ఆరూర్‌ రమేష్‌
19. పాలకుర్తి ---------- ఎన్‌. ప్రవీణ్‌ రావు
20 డోర్నకల్‌ ------------------ సుజాత మంగిలాల్‌
21. మహబూబా బాద్‌ ------------ డా. నెహ్రూనాయక్‌
22. న…ర్సంపేట్‌--------------- గోనెల రవీందర్‌
23. పరకాల్‌ ----------------- మందా ఐలయ్య
24. వరంగల్‌ వెస్‌‌ట---------- మాదాడి రవీందర్‌ రెడ్డి
25. వరంగల్‌ ఈస్‌‌ట ----------- డా. ప్రదీప్‌ రావు
26. వర్ధన్నపేట -------------------- జున్ను జకారియా
27. ములుగు------------------- జయరాం నాయక్‌
ఖమ్మం
28. పినపాక ------------------- జానకిరాం బేజావత్‌
29. ఇల్లెందు --------------------- బానోత్‌ శంకర్‌నాయక్‌
30 ఖమ్మం ---------------- ఎ. హరిబాబు
31. పాలేరు --------------- రాయల నాగేశ్వరరావు
32. మదిర --------------- డా. ఎస్‌ విజయవాణి
33. సత్తుపల్లి ---------------- నాగబత్తిన రవి
34. అశ్వారావు పేట ------------- తాటి నాగేందర్‌రావు
నల్గొండ
35. మిర్యాలగూడ --------- అలుగువెల్లి అమరేందర్‌ రెడ్డి
36. భువనగిరి--------------- పచ్చిమట్ల శివరాజ్‌ గౌడ్‌
నెల్లూరు
37. గూడూరు--------------- మడపాటి రవీంద్ర
38. సూల్లూరుపేట------------ గడికె ఈశ్వరమ్మ
39 కావలి ------------- రామిరెడ్డి ప్రతాప్‌రెడ్డి
40. ఉదయగిరి--------------- సుంకర అంజినాద్రి
తూర్పుగోదావరి
41.రంపచోడవరం శీతం శెట్టి వెంకటేశ్వరరావు
రంగారెడ్డి
42. మేడ్చల్‌ ------------- తోటకూర జంగయయాదవ్‌
43. షేర్లింగంపల్లి-------------- బండి రమేష్‌
44. చేవెల్ల --------------- డా. బాలు సావుల
నిజామాబాద్‌
45.ఆర్మూరు --------------- బద్దం మధుశేఖర్‌
46. కామారెడ్డి-------------- డి. విఠల్‌
47.నిజామాబాద్‌ రూరల్‌ ----------- డా. రవీందర్‌ రెడ్డి
కరీంనగర్‌
48. వేముల వాడ----------------- తీగల రవీందర్‌ గౌడ్‌
ఆదిలాబాద్‌
49. సిర్పూర్‌ -------------------- నెదురూరి మంగజి పటేల్‌
50. చెన్నూరు------------------- అందుగల శ్రీనివాస్‌
51. బెల్లంపల్లి --------------- అమరాజుల శ్రీదేవి
52. మంచిర్యాల ------------ కర్రె లచ్చన్న
53. అసీఫాబాద్‌ ------------ ఆడె రమేష్‌
54. కానాపూర్‌ --------------- బూగ్యా చంద్రశేఖర్‌
55. ఆదిలాబాదు---------------- చిలుకూరి తిరుపతి
56. భోద్‌ ---------------------- తొడసం విజయ లక్ష్మి
57. నిర్మల్‌ ------------------- ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి
58. ముదోల్‌ --------------------- గడ్డం విఠల్‌ రెడ్డి
విజయనగరం
59. కుర్పా -------------------- నిమ్మక జయరాజ్‌
60. చీపురు పల్లి---------------- రౌతు సునీత

Chiranjeevi will nominate from pallakollu

ఈ నెల 31 నుంచి పశ్చిమ గోదావరి జిల్లా పర్యన ప్రారంభించనున్న పీఆర్‌పీ అధినేత చిరంజీవి తన నామినేషన్‌ను పాలకొల్లులో దాఖలు చేయనున్నారు. ఏప్రిల్‌ 3న నామినేషన్‌ దాఖాలుతో జిల్లా పర్యటన ముగుస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి. నిడదవోలు, తణుకు, టీపీగూడెం, ఏలూరు, కైకలూరు, నర్సాపురం, పాలకొల్లులో చిరంజీవి రోడ్‌ షోలో పాల్గొంటారు

Friday, March 27, 2009

Family members visits the NTR

రోడ్డు ప్రమాదంలో గాయపడి కిమ్‌‌సలో చికిత్స పొందుతున్న జూనియర్‌ ఎన్టీఆర్‌ను చూసేందుకు కుటుంబసభ్యులు, ఆయన అభిమానులు, టీడీపీ కార్యƒర్తలు భారీగా తరలివస్తున్నారు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే టీడీపీ అధినేత కిమ్‌‌సలో వైద్యులకు ఫోన్‌ చేసి ఎన్టీఆర్‌కు అన్ని విధాల వైద్య సేవలు అందించాలని కోరారు. ఎన్టీఆర్‌తో బాబు కాసేపు మాట్లాడారు. ఎన్టీఆర్‌ తల్లితో పాటు టీడీపీ నేతలు నాగం జనార్థన్‌ రెడ్డి, కోడెల శివప్రసాద్‌, ఎరన్న్రాయుడుతో పాటు బాబాయ్‌ బాలకృష్ణ, పురందేశ్వరి, దగ్గుపాటి వెంకటేశ్వరరావు తదితరులు ఎన్టీఆర్‌ను సందర్శించారు. వేల సంఖ్యలో అభిమానులు ఆసుపత్రి వద్దకు చేరుకొని ఎన్టీఆర్‌ త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.

prajarajyam lokshaba candidates

ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే 9 లోక్‌సభ, 100 శాసనసభ అభ్యర్థులను జనం సమక్షంలో ప్రకటించారు. సామాజిక న్యాయం నినాదంతో ముందుకు వచ్చిన ప్రజారాజ్యం తొలి జాబితాలో బడుగులకు పెద్దపీట వేసింది. అసెంబ్లీ జాబితాలో 48 బీసీలు, 27 ఓసీలు, 13 ఎస్సీలు, 7 ఎస్టీలు, 5 మైనార్టీలకు చెందిన అభ్యర్థులు ఉండటం.

పార్లమెంట్‌ జాబితా

అరకు -ఎం. సింహాచలం

ఆదిలాబాద్‌ - ఎం, నాగారావ్‌

మాల్కాజిగిరి- టి. దేవేందర్‌గౌడ్‌

కరీంనగర్‌ - వి. రాజేందర్‌

శ్రీకాకుళం -వి. కళ్యాణి

జహీరాబాద్‌- శివకుమార్‌ లింగాయత్‌

హైదరాబాద్‌ - ఫాతిమా

వరంగల్‌ - రాజమౌళి

మహబూబాబాద్‌ - డీటీ నాయక్‌

NTR injured in accident

నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదంకు గురైన జూనియర్‌ ఎన్టీఆర్‌కు రెండు వారాల పాటు విశ్రాంతి అవసరమని కిమ్‌‌స వైద్యులు వెల్లడించారు. ఆయనకు ఎలాంటి ప్రానపాయం లేదని వారు తెలిపారు. ఎన్టీఆర్‌కు వెన్నుపుస వద్ద, చేతికి, తలకు, మోహంపై, వీపుపై గాయాలు అయ్యాయి. 48 గంటల పాటు పర్యవేక్షణ తరువాత సమీక్షిస్తామన్నారు. ఎన్టీఆర్‌ నడవగల్గుతున్నారు, అయితే ఆయన ఎట్టి పరిస్థితుల్లోను నడవడానికి, కూర్చోవడానికి వీలులేదని వైద్యులు తెలిపారు

prajarajyam first list of candidates

100 మందితో పీఆర్పీ అసెంబ్లీ తొలి జాబితా
నూతన తెలుగు సంవత్సరం విరోదినామ సంవత్సరాన ప్రజార్యాం పార్టీ తొలిజాబితా ప్రకటించింది. ఇందులో 100 అసెంబ్లీ, 9 పార్లమెంటు అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. ముందుగానె చెప్పనట్లు పార్టీ అధ్యక్షుడు చరీంజీవి తిరుపతి అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో తిరుపతి నుంచి ఆయన పేరు కూడా ఉంది. ఈ జాబితాలో 100 మందిలో 48 బీసీలకు, 27 ఓసీలకు, 13 ఎస్సీలకు, 7 ఎస్టీలకు, 5 సీట్లు మైనార్టీలకు కేటాయించారు.

అసెంబ్లీ జాబితా

అనకాపల్లి - గంటా శ్రీనివాసరావు
విశాఖ (పశ్చిమ) - గణబాబు
విశాఖ ( దక్షిణ) - కోలా గురువులు
మాడుగుల - పైలా ప్రసాదరావు
పాడేరు - టి.కృష్ణవేణి
నర్సీపట్నం - ఆర్‌.యర్రాపాత్రుడు
ఇచ్చాపురం - నార్తు శేషగిరిరావు
గిద్దలూరు - ఎ.రాంబాబు
జూబ్లీహిల్‌‌స - హుమయాన్‌
నాంపల్లి - ఫిరోజ్‌ఖాన్‌
సికింద్రాబాద్‌ (కంటోన్మెంట్‌) - నర్రా రవికుమార్‌
దుబ్బాక - నాగేశ్వరరెడ్డి
కూకట్‌పల్లి - కూన వెంకటేశ్వర్‌రెడ్డి
మచిలీపట్నం - బూరగడ్డ వేదవ్యాస్‌
కైకలూరు - కామినేని శ్రీనివాసరావు
గుడివాడ - రావి వెంకటేశ్వరరావు
నూజివీడు - ఎం. విజయనిర్మల
ఆళ్లగడ్డ - శోభానాగిరెడ్డి
నంద్యాల - ఏవీ సబ్బారెడ్డి
డోన్‌ - గోవిందరాజులు
పాణ్యం - డి.విష్ణువర్ధన్‌రెడ్డి
ఉప్పల్‌ - నరేంద్ర
చార్మినార్‌ - యూసుఫ్‌అలీ
ఎల్బీనగర్‌ - సామా రంగారెడ్డి
వైరా - బి. వాణి కుమారి
ఆమదాలవలస - తమ్మినేని సీతారాం
భద్రాచలం - శరత్‌
సంగారెడ్డి - ఫయాజ్‌
బోధన్‌ - కెప్టెన్‌ కరుణాకర్‌రెడ్డి
ఎచ్చెర్ల - కళావెంకట్రావ్‌
పార్వతీపురం - ఆర్‌.లలిత
జుక్కల్‌ - అరుణాతార
పాతపట్నం - పాలవసల కరుణాకర్‌
శ్రీకాకుళం - ప్రతాప్‌
నర్సన్న పేట - డోలా జగన్‌
రాజాం - కంబాల జోగులు
పాలకొండ - వి.కళావతి
సాలూరు - హనుమంతరావు
బొబ్బిలి - మెరుపుల వెంకటరమణ
గణపతినగరం - కె.శ్రీనివాస్‌
నెల్లిమర్ల - కందుల రఘుబాబు
విజయనగరం - మీసాల గీత
ఎస్‌.కోట - గొర్లె మహేశ్వరరావు
బాన్సువాడ - కాసుల బాలరాజు
బాల్కొండ - అనిల్‌
నిజామాబాద్‌ (అర్బన్‌) - రహీమ్‌
కోరుట్ల - సునీల్‌ వెంటక్‌
జగిత్యాల - చంద్రశేఖరగౌడ్‌
ధర్మపురి - గెడ్డం రాజేశ్‌
చొప్పదండి - లావణ్య
మంథని - బుట్టామధు
పెద్దపల్లి - వేముల శశిరేఖ రామూర్తి
సిరిసిల్ల - గాజుల బాలయ్య
మానకొండూరు - కవ్వంపల్లి సత్యనారాయణ
హుజారాబాద్‌ - పింగళి వెంకటేశ్వరరావు
నగరి - సుదర్శన్‌ వర్మ
తంబళ్లపల్లి - కలిచర్ల ప్రభాకర్‌రెడ్డి
పీలేరు - చింతల రామచంద్రారెడ్డి
చంద్రగిరి - సైకం జయచంద్రారెడ్డి
శ్రీశైలం - బుడ్డా శేషారెడ్డి
కోడుమూరు - కరుణాకర్‌
ఆలూరు - జయరాం
మల్కాజిగిరి - కనకారెడ్డి
పలాస - వి.నాగేశ్వరరావు
టెక్కలి - దువ్వాడ శ్రీనివాస్‌
గుడివాడ - రావి
ప్రొద్దుటూరు - ఎం.వీ. మురళీధర్‌రెడ్డి
జమ్మలమడుగు - వి.నాగేంద్రయాదవ్‌
మహేశ్వరం - ఎవీఎం రెడ్డి
తాడిపత్రి - పైలా నర్సింహయ్య
పెనుగొండ - కె.రమేష్‌బాబు
రాయదుర్గం - బోసుల మనోహర్‌
అనంతపురం - టి.జె. ప్రకాష్‌
కల్యాణదుర్గం - కె.రామన్న
కదిరి - డాక్టర్‌ సిద్దారెడ్డి
ఉరవకొండ - చెన్నకేశ్వరరావు
అంబర్‌పేట - శ్రీనివాస్‌ గౌడ్‌
సనత్‌నగర్‌ - మహేందర్‌
చాంద్రాయణగుట్ట - రాజుయాదవ్‌
రాజేంద్రనగర్‌ - సామా రాజ్‌పాల్‌ రెడ్డి
దేవరకద్ర - కె.రవికుమార్‌
దేవరకొండ - రమేష్‌గౌడ్‌
నాగార్జునసాగర్‌ - రామచంద్రనాయక్‌
తిరుపతి - చిరంజీవి
మెదక్‌ - బి.జగపతి
కార్వాన్‌ - వెంకటకృష్ణ
కొదాడ - జగడం సుధాకర్‌
సూర్యాపేట - ధనుంజయ్‌గౌడ్‌
ఆలేరు - శోభారాణి
నల్గొండ - దుబ్బాక నరసింహారెడ్డి
కొత్తగూడెం - వై.కృష్ణ
భద్రచలం - సుభద్ర
బనగానపల్లె - కాటసాని రామిరెడ్డి
కురుపాం - లక్ష్మణమూర్తి
చిత్తూరు - జంగంపల్లి శ్రీనివాస్‌
అచ్చంపేట - మునీంద్రనాథ్‌

లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా

అరకు -ఎం. సింహాచలం

ఆదిలాబాద్‌ - ఎం, నాగారావ్‌

మాల్కాజిగిరి- టి. దేవేందర్‌గౌడ్‌

కరీంనగర్‌ - వి. రాజేందర్‌

శ్రీకాకుళం -వి. కళ్యాణి

జహీరాబాద్‌- శివకుమార్‌ లింగాయత్‌

హైదరాబాద్‌ - ఫాతిమా

వరంగల్‌ - రాజమౌళి

మహబూబాబాద్‌ - డీటీ నాయక్‌

Finally Prajarajyam gets Common symbol

ప్రజారాజ్యం పార్టీకి ఉమ్మడి గుర్తు రావడం ఆ పార్టీ అధినేత చిరంజీవి హర్షం ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లాలో ప్రజాఅకింత యాత్రలో పాల్గొన్న చిరంజీవి ఉమ్మడి గుర్తు రావడంపై స్పందించారు. చాలా మంది కామన్‌సింబల్‌ రాదన్నారు, మేం ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నామని... ఉగాది రోజు కామన్‌సింబల్‌ లభించడం సంతోషదాయకం అని ఆయన అన్నారు. ప్రజాబలం వల్లే ఉమ్మడి గుర్తు వచ్చిందని చిరు చెప్పారు.

Thursday, March 26, 2009

YSR gets lukewarm response in rangareddy district

ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సభలు తుస్సుమన్నాయి. ఎన్నికల నేపథ్యంలో వైఎస్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకుని సెంట్‌మెంట్‌గా భావించే చేవెళ్ల నుంచి చేపట్టిన `జైత్ర యాత్ర'సభలు జనం లేక వెలవెలబోయాయి. 2003లో ప్రతిపక్ష నేతగా వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చేవెళ్ల నుంచి ప్రజాప్రస్థానం పేరిట ప్రారంభించిన పాదయాత్ర కార్యక్రమానికి, ఇప్పటి కార్యక్రమానికి పొంతనే లేదని ఆ పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారు. నాడు భారీగా తరలివచ్చిన జన వాహినితో సభ కిటకిటలాడగా, ప్రస్తుతం జనం లేక సభలు వెలవెల బోయాయి. చేవెళ్లతో పాటు జిల్లాలో ఎక్కడ ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని నిర్వహించినా భారీగా వ… చ్చే జనం ఈ సభకు రాక పోవడంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో అయో మయం నెలకొంది. ఆ పార్టీపై ప్రజల్లో ఉన్నవ్యతిరేకత ఓ కారణమైతే, జిల్లాలో సొంతపార్టీ నేతల మధ్య రగులుతున్న విభేదాలు మరో కారణమన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. చేవెళ్లలోని స్టేడియమ్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆశించిన స్థాయిలో జనం లేకపోవడంతో ముఖ్యమంత్రి సైతం అసంతృప్తి వ్యక్తంచేసినట్లు సమాచారం.

ఉదయం పదకొండు గంటలకు ప్రారంభం కావల్సిన ఈ సమావేశానికి మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు వరకు సమావేశ ప్రాంగణం వద్ద పట్టుమని రెండు వందల మంది కూడా లేకపోవడం కార్యకర్తలను సైతం విస్మయానికి గురిచేసింది. ఒంటిగంటల ప్రాంతంలో ఓ మోస్తారుగా జనం స్టేడియమ్‌కు చేరుకున్నారు. దీంతో పార్టీ నాయకులే పెదవివిరిచారు. చేవెళ్లలో ఐదేళ్ల క్రితం నిర్వహించిన ప్రజాప్రస్థానం కార్యక్రమానికి, బుధవారం జరిగిన సభకు ఎంతో తేడా ఉందని నేతలు బహిరంగంగానే అంగీకరిస్తున్నారు. వికారాబాద్‌లోనూ ఇదే పరిస్థితి. ఇరుకైన ప్రదేశంలో సభను పెట్టడంతో జనం తక్కువగా ఉన్నా ఎక్కువ మంది కనిపించేలా కాంగ్రెస్‌ నేతలు జాగ్రత్త పడ్డారు. ముఖ్యమంత్రి సభ అంతంత మాత్రంగానే జరిగింది. పరిగిలో జనం నుంచి మిశ్రమ స్పందన లభించింది.

మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం కావల్సిన సమావేశానికి మూడున్నరకు వరకు జనంలేక సభ ప్రాంగణం వెలవెలబోయింది. అయితే, సాయంత్రం నాలుగుగంటలకు ముఖ్యమంత్రి వచ్చే సమయానికి మోస్తారుగా జనం వచ్చారు. తాండూరులో రాత్రి జరిగిన సమావేశంలోను ప్రజలనుంచి స్పందన కరువైంది. కాంగ్రెస్‌ ప్రభుత్వ వ్యతిరేకత వల్లే ముఖ్యమంత్రి సభలకు జనం నుంచి స్పందన ఆశించిన స్థాయిలో లేదని కొందరు పేర్కొంటుండగా, జిల్లానేతల మద్య కొద్దిరోజులుగా రగులుతున్న విభేదాలు, టిక్కెట్ల కేటాయింపే ఇందుకు కారణమని ఇంకొందరు అభిప్రాయపడుతుండగా, అధిష్ఠాన…ం వైఖరితో అలిగిన చేవెళ్ల చెల్లెమ్మ, మంత్రి సబితారెడ్డి ఎక్కువగా ఆసక్తిని కరబరచకపోవడంతోనే సిఎం సభలు వెలవెలబోయాయని మరికొందరు చెవులు కొరుక్కుంటున్నారు. ఇదిలావుం డగా, జిల్లాలో ఎంతో పటిష్టంగా ఉన్న కాంగ్రెస్‌ క్రమంగా తన ప్రాభవాన్ని కోల్పోయిందా అన్న అనుమానాలను వ్యక్తంచేస్తున్నారు.

yeramnaidu comments Prajarajyam

ప్రజారాజ్యంపార్టీపై టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎరన్న్రాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వివిధ పార్టీల్లోంచి ఇంకెవరెవరు వలస వస్తారా అని ప్రతిరోజూ ఎదురుచూసే పార్టీ ఒక రాజకీయపార్టీ యేనా? ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇప్పటి వరకు ఒక గుర్తు కూడా లేని పార్టీ అది.. ఇక ఆపార్టీలో చేరిన వారిని ఎలా గుర్తిస్తుంది ? అని ఆయన వ్యంగ్యాసా్తల్రు సంధించారు. ప్రజా సమస్యలపై ఆపార్టీకి చిత్తశుద్ధిలేని పార్టీని ప్రజలు ఆదరించరని, ఈ విషయం ఆ పార్టీకి త్వరలోనే తెలుస్తుందని తెలిపారు. బుధవారం ఎన్టీఆర్‌ ట్రస్‌‌టభవన్‌లో సీనియర్‌నేత రావుల చంద్రశేఖరరెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

కేంద్రంలో కాంగ్రెస్‌, బిజెపిలకు కాలంచెల్లిందని, సంకీర్ణ సర్కారు ఏర్పాటు శరణ్యమన్నారు. రానున్న రోజుల్లో కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలంటే ప్రాంతీయ పార్టీల పాత్ర కీలకం కానుందన్నారు. మహాకూటమి విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు. మేనిఫెస్టోలో కాంగ్రెస్‌ కల్లబొల్లి కబుర్లు చెప్పిందని, అనై తిక విధానాలు అవలంభించే పార్టీ ఏదైనా ఉంటే అది కాంగ్రెసే నన్నారు. యుపిఏ కనీస ఉమ్మడి ప్రణాళికను విస్మరించి అణుఒప్పందాన్ని తెరమీ దికి తీసుకుచ్చిందన్నారు. ఆ రోజువామపక్షాలతో జతకట్టిన కాంగ్రెస్‌ వారిని ఎందుకు దూరం చేసుకుందో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.

Manaparty joined hands with Prajarajyam

ప్రజారాజ్యంతో మనపార్టీ పొత్తు ఖరారు అయింది. గురువారం పీఆర్పీ కార్యాలయంలో పారీ నేత అల్లు అరవింద్‌తో పాటు మనపార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ మీడియాతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా అరవింద్‌ మాట్లాడుతూ...ప్రజారాజ్యం పార్టీయే సామాజియ న్యాయం చాంపియన్‌ అని తెలిపారు. సామాజిక న్యాయంను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మనపార్టీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు చెప్పారు. 80 శాతం కొత్తవారికే ఎన్నికల రంగంలోకి దింపుతామని ఆయన అన్నారు. కాసాని మాట్లాడుతూ తమ పార్టీ సామాజిక న్యాయంతోనే ఏర్పడిందని అందుకే పీఆర్పీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు తెలిపారు. ఈ సాయంత్రం లోపు సీట్ల వివరాలు చెబుతామని అరవింద్‌ అన్నారు. అయితే 4 అసెంబ్లీ, 1 పార్లమెంట్‌ ఇచ్చేందుకు పీఆర్పీ అంగీకరించినట్లు సమాచారం. కాసాని చెవేళ్ల ఎంపీ స్థానానికి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తొంది.

Tuesday, March 24, 2009

Chiru's westgodhavari tour on 26

ఈ నెల 26 నుంచి ప్రజా రాజ్యం అధ్యక్షుడు చిరంజీవి తూర్పు గోదావరి జిల్లాలో ఐదురోజుల పాటు పర్యటించనున్నారు. పాయకరావు పేట నియోజక వర్గంలోని కోటనందూరు నుంచి చిరు రోడ్‌ షో ప్రారంభమై చివరోజురాజోలులో పర్యటన ముగియ నున్నది. తొలి దశ ఎన్నికల జాబితాను ప్రకటించి ఈ నెల 25నే చిరు తూర్పుగోదావరి జిల్లా పర్యటన ప్రారంభిం చాల్సి ఉంది. మరో వైపు మహాకూటమి అభ్యర్థుల జాబితాను ప్రకటించడంలో కొంత జాప్యం చేయడంతో చిరు పర్యటను కూడావాయిదా పడింది.

పోటీచేసే ఆశావాహుల సంఖ్య ఎక్కువే...

ప్రతి నియోజక వర్గంలోనూ పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఎవరికి సీటు ఇచ్చినా మరొకరు పార్టీకి నష్టం చేసే పరిస్థితి కనబడడంతో దీన్ని ముందుగానే గ్రహించి తెలంగాణ జిల్లాల నాయకులతోను, పోటిచేసే అభ్యర్థులతోను ప్రజారాజ్యం నాయకులు పరకాల, పవన్‌, మిత్రా, కె వినయ్‌ కుమార్‌ ఆ జిల్లా కన్వీనర్లు కలిసి సమావేశం మంగళవారం నిర్వహించారు. ఇప్పటికే తెలంగాణలోని తొమ్మిది జిల్లాల్లోని పోటిచేసే అభ్యర్థులతో పీఆర్పీ నాయకత్వం హైదరాబాద్‌కు పిలిపించి సమావేశాలు పూర్తి చేశారు. అప్పటికే సమయం ఎక్కువ కావడంతో ఒక్క మహాబూబ్‌ నగర్‌ జిల్లా పోటీచేసే అభ్యర్థుల సమావే శాన్ని బుధవారం ఉదయానికి వాయిదా వేశారు. ఇదిలా ఉండగా పీఆర్పీ సీట్ల విడుదల చేస్తున్నట్లు తెలియడంతో పెద్ద ఎత్తున పోలీస్‌ సిబ్బంది కూడా సెక్యూరిటీ నిమిత్తం పార్టీ కార్యాలయాలకు చేరుకోవడం విశేషం.

కామన్‌ గుర్తు వాదనలు 27కి వాయిదా...

ప్రజారాజ్యం పార్టీ కామన్‌ గుర్తు వాదనలు ఈ నెల 27కి సుప్రీం కోర్టు వాయిదా వేసింది. ఈ నెల 25నే సుప్రీం కోర్టులో పీఆర్పీ కేసు హీరింగ్‌కు రావాల్సి ఉన్నా మంగళవారం నాటికి వాయిదా పడింది. మంగళవారం వాదనలు ప్రారంభమై ఈ నెల 27కు కేసును సుప్రీం న్యాయ మూర్తులు వాయిదా వేశారు.ఇప్పటికీ రాజ్యం కామన్‌ గుర్తుపై మేకపోతుగాంభీరం నాయకులు వెల్లడిస్తున్నప్పటికీ, మరోవైపు నామినేషన్ల గడువు దగ్గరపడడంతో ప్రత్యామ్నాయ మార్గాలను వెల్లడించడానికి పార్టీ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. మరో 48 గంటలకు ముందే పార్టీ కామన్‌ గుర్తుపై పీఆర్పీ నాయకత్వం ఒక నిర్ణయం వెల్లడించే అవకాశాలు కనబడుతున్నాయి.

Rebel star joins with Mega star's Prajarajyam

ప్రజా విజయభేరి సాధించిన జన విజయంతో ప్రజారాజ్యం పార్టీ పాపులార్టీని మరింత పెంచింది. పార్టీ అధ్యక్షులు మెగాస్టార్‌ చిరంజీవికి రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు తోడు కలిసారు. దీంతో స్టార్‌డమ్‌ రెట్టింపు అయ్యింది. కాంగ్రెస్‌ పార్టీ విడుదల చేసిన ఎన్నికల మ్యానిఫెస్టోలు అంతకు ముందు విడుదల అయిన తెలుగు దేశం పార్టీ ఎన్నికల ముసాయిదాలు ప్రజారాజ్యం పార్టీ విధి విధానాలముందు సాటిరావనే అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంపొం దించింది. సత్తా ఉన్న బీసీ నాయకులు పార్టీలో చేరడానికి ఉత్సాహం చూపుతుండడం కూడా పీఆర్పీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.

బీసీ నేతలను పార్టీలో చేర్చుకునే విషయమై చిరంజీవి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. కొత్తగా పార్టీలో చేరిన నాయకులు పార్టీని పరిపుష్టం చేయాలని చిరు భావిస్తున్నారు. ఆ దిశగా ఆయన వ్యూహరచనలు చేస్తున్నారు. చిరంజీవి కొద్ది కాలంలోనే అత్యంత ప్రజాదరణ ఉన్న నేతల జాబితాలో ఒకరిగా చేరిపోయారు. సామాజిక న్యాయమే ప్రాణంగా పుట్టుకొచ్చిన పార్టీకి ఆయా జిల్లాల్లో సత్తా ఉన్న నేతలు ఒకరి వెంట ఒకరు తోడవుతున్నారు. మాజీ ఐపిఎస్‌ అధి కారి బిటి నాయక్‌, ఎన్టీఆర్‌ను ఓడించి జెయింట్‌ కిల్లర్‌గా పేరొందిన చిత్తరంజన్‌దాస్‌ తదితరులతోపాటు సినీ రంగా నికి చెందిన మరికొందరు కూడా పార్టీలో చేరేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం.

లక్షలాదిగా తరలి వచ్చిన అభిమానులతో తిరుపతిలో ప్రజా రాజ్యం అవిర్భావం పార్టీకి బలమైన పునాదులు వేసింది. ప్రారంభ దశలో పార్టీలో రాజకీయ అనుభవం ఉన్న వారు పెద్దగా లేకపోయినా తిరుపతి సభలో కన్పించిన లక్షలాది ప్రజాభి మానం చూసి ఇక తిరుగులేని రాజ కీయ శక్తిగా వెలుగుతుందనే అభిప్రా యం రాజకీయ ఆశావాదులను ఆపార్టీ వైపు నడిపించింది. కాకలు తీరిన శివశంకర్‌, ఉపేంద్ర తదితర రాజకీయ సీనియర్లు సైతం పార్టీలో చేరేందుకు తిరుపతి సభ విజయ వంతమై ప్రేరణ ఇచ్చింది. ప్రజా రాజ్యం పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో బల మైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగు తుందని భావించినకాంగ్రెస్‌, తెలుగు దేశం పార్టీలు అప్పటిదాకా ఉన్న నిర్లక్ష్యం వదిలి జాగ్రత్త పడక తప్ప లేదు. ప్రజారాజ్యంపై ఆ రెండు పార్టీలు విమర్శల దాడి ప్రారంభిస్తూ వచ్చాయి.

రాళ్లు తగిలే కొద్దీ రాటు దేలుతారన్న చందంగా చిరంజీవి కూడా రాజకీయ వ్యూహాలకు పదు నెక్కిస్తూ వచ్చారు. ప్రజాబలం లేదని సినీ గ్లామర్‌ ఓట్లు రాల్చదంటూ వస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు ఆయన కోస్తాను ఎంచుకున్నారు. వెనుక బడిన బడుగు బలహీన వర్గా లకు రాజకీయరంగంలో తగిన ప్రాధాన్యం కల్పించేందుకే పార్టీ కట్టుబడి ఉందన్న నినాదంతో రాజ మండ్రి వేదికగా సామాజిక న్యాయ శంఖారావం పూరించారు. శ్రీకాకు ళం నుంచి గుంటూరు దాకా ఈ సభకు జనం పెద్ద ఎత్తున తరలి రావడం ప్రజారాజ్యానికి మరింత ధైర్యాన్ని ఇచ్చింది. కోస్తా ఆంధ్రాలోనూ పార్టీకి తిరుగులేని ప్రజాదరణ ఉందన్న అభిప్రాయం రాజమండ్రి సభ సక్సెతో మరింత దృఢ పడింది. తెలంగాణా నినాదంతో టిఆర్‌ఎస్‌ తెలుగుదేశం పార్టీతో జట్టుకట్టి మహాకూటమిలో సీట్ల సర్దుబాట్ల కసరత్తుల్లో ఎడతెగని చర్చలు జరుపుతుండగానే చిరంజీవి మెరుపు వేగంతో స్పందించారు.

కేవలం నాలుగు రోజుల గడువులోపే రాజధాని వేదికగా ప్రజా విజయభేరికి పిలుపునిచ్చారు. సామాజిక తెలంగాణా నినాదంతో ముందుకు సాగుతున్న ప్రజారాజ్యం పార్టీ పిలుపుకు తెలంగాణా ప్రజలు పెద్ద ఎత్తున స్పందించారు. పెరేడ్‌గ్రౌండ్‌ చరిత్రలో గత పదేళ్లుగా ఎన్నడూ లేని విధంగా లక్షల సంఖ్యలో ప్రలు విజయభేరికి కదలి వచ్చారు. ఈ సభ విజయవంతం పార్టీకి మరింత ఉత్తేజాన్ని నింపింది. పార్టీ అధినేత చిరంజీవి తన ప్రసంగంలో అపార అనుభవం ఉన్న నాయ కుడిలా ప్రసంగించడం అన్ని అంశాలను స్పృశిస్తూ తొణుకు, బెణుకు లేకుండా ప్రసం గించి రాజకీయ పరిశీలకును సైతం ఆశ్చర్య పర్చారు. యువరక్తంతో ఉరకలు వేస్తున్న పవన్‌ కళ్యాణ్‌ చేసిన ప్రసంగం విజయభేరిని ఉర్రూతలూ గించింది. ఈ సభ స్పందనతో తెలం గాణా జిల్లాలోనూ ప్రజారాజ్యం పార్టీకి మంచి ఆదరణే ఉందన్న అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో వ్యక్తం అవుతోంది.

సభానంతరం గత రెండు రోజులుగా చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు,ప్రజారాజ్యం పార్టీ మంచి ఊపుమీద ఉన్నట్లు స్పష్టం అవుతోంది. మనపార్టీ అధ్య క్షులు కాసాని జ్ఞానేశ్వర్‌ ప్రజా రాజ్యంతో జట్టుకట్టేందుకు అన్ని విధాల ఏర్పాట్లు చేసుకున్నారు. పార్టీ అభ్యర్థుల ఎంపికపై చిరంజీవి సామాజిక న్యాయ సూత్రాన్ని పాటి స్తూనే సమర్ధత గలవారికి జాబితాలో అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు సమాచా రం. తుదిమెరుగులు దిద్దుకున్న ప్రజారాజ్యం పార్టీ తొలిజాబితాను బుధవారం విడుదల చేయనున్నట్లు చిరంజీవి వెల్లడించారు. మరికొం దరు కొత్తవారు పార్టీలో చేరే అవకా శాలు ఉండడంతో ఆచి తూచి అడు గులు వేసేందుకు పార్టీ నాయకులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

రాజ్యంలోకి రెబ్‌ స్టార్‌

హైదరాబాద్‌, మేజర్‌ న్యూస్‌ : ప్రజారాజ్యంలోకి సినీ తారల తాకిడి పెరిగింది. దీనిలో భాగంగా మంగళవారం రెబల్‌ స్టార్‌ యువి కృష్ణం రాజు ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి సమక్షంలో పార్టీలో చేరారు. ఆయనతోపాటు ఎరవ్రరం మాజీ ఎంఎల్‌ఏ సీతం శెట్టి వెంకటేశ్వర రావు కూడా పార్టీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ సినీ పరిశ్రమలోకి ప్రవేశించిన తొలిదశలో అనేక ఆటు పోట్లను ఎదుర్కొన్నానని, ఆ సమయంలో కృష్ణం రాజు ఎంతో సహకరించారని ఆయన చెప్పారు. ఇద్దరం మొగƒ ల్తూరుకు చెందిన వారం కావడం, అన్నయ్యగా పిలుచుకునే కృష్ణం రాజును పార్టీలో చేర్చుకోవడం ఎంతో సంతోషంగా ఉందని చిరంజీవి తెలిపారు. కృష్ణం రాజుతో కలిసి నటించాలనే కోరిక తనకు బలంగా ఉండేదని, మా ఊరి పాండవులు చిత్రంతో అది నిజమైందని చిరు ఎంతో ఆనందంగా వెల్లడించారు.

సినీ పరిశ్రమంతా ఒకటే కుటుంబం...

ప్రజా రాజ్యం పార్టీకి సినీ పరిశ్రమ దూరంగా ఉందనే విమర్శలు కృష్ణం రాజు చేరికతో పటాపంచలైనాయని, ఎప్పుడూ తనవెంటే చిత్ర పరిశ్రమ ఉందని, తామంతా ఒకటే కుటుంబమని చిరు పేర్కొన్నారు. ఒకటి రెండు రోజుల్లో మరికొంత మంది తారలు కూడా పార్టీలో చేరే అవకాశం ఉందని చిరు తెలిపారు. కృష్ణం రాజుకు నర్సాపూర్‌ టిక్కెట్‌ కేటాయిస్తారా..? అని విలేకరుల ప్రశ్నించగా, బుధవారం ప్రకటించే జాబితాల్లో చూడమని చిరు పేర్కొన్నారు. మొగల్తూరుకు ఎప్పుడు వెళ్తారని చిరును విలేకరుల అడగగా ఏప్రిల్‌ మొదటి వారంలో వెళ్ళనున్నట్లు ఆయన చెప్పారు.

అనంతరం కృష్ణం రాజు మాట్లాడుతూ సినీ పరిశ్రమలో చిరంజీవి ప్రారంభం నుంచీ ఎంతో కష్టపడి ఉన్నత స్థాయికి చేరుకున్నారని, అదే విధంగా నేడు పార్టీని కూడా మంచి ఆశయాలు, లక్ష్యాలతో ప్రారంభించారని కృష్ణం రాజు చెప్పారు. తప్పకుండా తమ్ముడు చిరంజీవి పార్టీ రాష్ట్రంలో మంచి ఫలితాలను సాధిస్తుందని, మారుమూల ప్రాంతాల్లోనూ ప్రజలు చిరంజీవి ఫొటోలు పెట్టుకొని మరీ పూజిస్తున్నారని వెల్లడించారు.

రాష్ర్టంలో బీజేపీ ఆశయాలు కష్టమే...

రాష్ట్రంలో బీజేపీ ఆశయాలు,లక్ష్యాలను అమలు చేయడం కష్టమని, అందుకనే ప్రజారాజ్యం పార్టీలోకి చేరుతున్నానని కృష్ణం రాజు చెప్పారు. జాతీయ సమస్యలను పరిష్కరించాలంటే అది బీజేపీ తోనే సాధ్యమని అన్నారు. బీజేపీ నుంచి తాను ఎందుకు పీఆర్పీలోకి వచ్చిందీ ఒకటి రెండు రోజుల్లో విలేకరులకు వివరిస్తానని ఆయన తెలిపారు. ఎన్నికల్లో ప్రబాస్‌ను ప్రచారానికి వినియోగించనని కృష్ణం రాజు తెలిపారు. పార్టీ కోరితే రాష్ర్ట మంతటా పర్యటిస్తానని, కొన్ని సందర్భాల్లో ఇద్దరƒ మూ ప్రచారంలో పాల్గొంటామని రెబల్‌ స్టార్‌ పేర్కొన్నారు.

Monday, March 23, 2009

Lukewarm response shocks TDP - Hindu

Lukewarm response shocks TDP - Hindu
Staff Reporter

Ravulapalem (East Godavari): It was once a bastion of the TDP. It won all the six constituencies during the elections in 1983, 1994 and 1999. Party’s founder-president N.T. Rama Rao was given a rousing reception wherever he went. Some even said that coconut trees, which dot the picturesque Konaseema area, seemed to have bowed their heads to welcome the actor-turned-politician. Even the party under Chandrababu Naidu won the elections in 1994 and 1999. But, all that seems to be history now.

TDP’s ‘star’ campaigner NTR Junior, who launched his tour from Tuni constituency, which is represented by senior party leader Yanamala Ramakrishnudu, did not receive the response that was expected. “The first day tour on Saturday was better when compared to the second day tour on Sunday in Konaseema,” commented a TDP leader from Pitapuram, who is accompanying Mr. NTR.

Tallarevu, Mummidivaram, Amalapuram, which he toured on the second day, did not witness huge crowds. But the numbers were not less than any other big political leader. What surprised the party leaders was that women did not come out voluntarily from houses to have a glimpse of the actor

Prajarajyam ADS

http://www.youtube.com/watch?v=yM_BX5z4iGA&feature=PlayList&p=00CE5A2BBEC0D88B&index=5


http://www.youtube.com/watch?v=oGmbElTjn20&feature=PlayList&p=00CE5A2BBEC0D88B&index=4


http://www.youtube.com/watch?v=Mvl_PsMBZp0

http://www.youtube.com/watch?v=MSZgog6y-HA


http://www.youtube.com/watch?v=8WagraXtJCM

http://www.youtube.com/watch?v=ca-m8kA34qY

http://www.youtube.com/watch?v=BEMVXt2JPRs

http://www.youtube.com/watch?v=4RUpuZGIBZ4

http://www.youtube.com/watch?v=fJk9UnLnCEo

Get life time free sms alerts about Prajarajyam

Okka sms tho life time free sms alerts MegaStar
Now get free sms alerts on

Chiru Political News,

Ram charan movie updates

Power Star political and movie news

and

Bunny movie updates....

Every thing related to our mega family...

Just Type

On Jaichiru

and send to 9870807070.

or

Just click below link....
http://labs.google.co.in/smschannels/subscribe/Jaichiru

Its absolutely free for megafans.....

Prajarajyam brings Samajika Nyayam

Anti-Reservations (caste based)
ikada chala mandi Samajika Nyayam, Samajika Nyayam, Samajika Nyayam ani antaru...
adi ante endo kuda sariga telidhu...
caste population based seats isthe Samajika Nyayam ayipothundhi anta...



Samajika Nyayam / Social Justice applies to all fields in our lives...
PRP cheppe Samajika Nyayam jus politics lo ne kadhu... annitilo...ㅤ



Politics lo inni rojulu Samajika Nyayam ledhu !!!
ipudu PRP thesthundhi...

but understand one thing,

ipudu last 5 yrs congress rule lo, state lo vunna reddys ki special treatment em ivvaledhu !!!
evaro rich & influence ppl ki advantage... middle-class/poor ppl ki em theda ledhu...

same with TDPs 9 yrs rule lo with kammas...



Pity some people hear r so angered, depressed abt injustice done to some castes in politics...

but cant see this great injustice - caste/religion based reservations...ㅤ



politics lo ma caste ki anyayam jaruguthundhi ani ane vallaki enduku dhairyam ledhu ee injustice gurunchi matladaniki...

jus becoz miku reservations favour lo vundhi kadha ana...???



There is NO Samajika Nyayam, till there r caste-based reservations...
Becoz there is no fair & equal playing field...



I really hope if PRP really stands on Samajika Nyayam, it will abolish caste based reservations by NEXT elections...

Jayaprakash comments on Chiru

జయప్రకాశ్ నారాయణ్ అంటే నాకు ఇన్ని రోజులు మంచి గౌరవం ఉండేది.
నా నోటితో నేను ఎన్నో సార్లు చాలా మందికి అతని గురించి గొప్పగా చెప్పను ఇది వరకు.

కాని ఇన్ని రోజుల అవినీతి చేసిన ప్రభుత్వాలను వదిలి, ప్రజా సేవకై వచ్చిన అన్నయ్యపై విమర్శలు చేయడం చూస్తుంటే జయప్రకాశ్ ఇంతకాలం కేవలం మంచి వాడిలా నటించాడని అనిపిస్తుంది.

ఈ రోజు inews లో చూసాను Car లో interview with jayaprakash advertisement ఇస్తున్నారు.
అందులో inews anchor ఇలా అడిగాడు.



Q:"మీ దృష్టిలో సామజిక న్యాయం అంటే(చిరు ని ఉద్దేశించి)".

A:"నా దృష్టిలో సామజిక న్యాయం అంటే నిన్నటి వరకు వీడు దోచుకున్నాడు ఇప్పుడు ఇంకొకడికి దోచుకునే అవకాశం ఇచ్చినట్టు" అని అన్నాడు.

.

వీడు అటు తిరిగి ఇటు తిరిగి మనల్నే(chiru) target చేస్తున్నాడు. ఏమన్నా విమర్శిద్దాము అంటే ఇన్ని రోజులు మంచి వాడిలా గుర్తింపు పొందాడు కాబట్టి వాడిని ఏది అనలేని పరిస్థితి.

Jayaprakash comments on Chiru

జయప్రకాశ్ నారాయణ్ అంటే నాకు ఇన్ని రోజులు మంచి గౌరవం ఉండేది.
నా నోటితో నేను ఎన్నో సార్లు చాలా మందికి అతని గురించి గొప్పగా చెప్పను ఇది వరకు.

కాని ఇన్ని రోజుల అవినీతి చేసిన ప్రభుత్వాలను వదిలి, ప్రజా సేవకై వచ్చిన అన్నయ్యపై విమర్శలు చేయడం చూస్తుంటే జయప్రకాశ్ ఇంతకాలం కేవలం మంచి వాడిలా నటించాడని అనిపిస్తుంది.

ఈ రోజు inews లో చూసాను Car లో interview with jayaprakash advertisement ఇస్తున్నారు.
అందులో inews anchor ఇలా అడిగాడు.



Q:"మీ దృష్టిలో సామజిక న్యాయం అంటే(చిరు ని ఉద్దేశించి)".

A:"నా దృష్టిలో సామజిక న్యాయం అంటే నిన్నటి వరకు వీడు దోచుకున్నాడు ఇప్పుడు ఇంకొకడికి దోచుకునే అవకాశం ఇచ్చినట్టు" అని అన్నాడు.

.

వీడు అటు తిరిగి ఇటు తిరిగి మనల్నే(chiru) target చేస్తున్నాడు. ఏమన్నా విమర్శిద్దాము అంటే ఇన్ని రోజులు మంచి వాడిలా గుర్తింపు పొందాడు కాబట్టి వాడిని ఏది అనలేని పరిస్థితి.

Friday, March 6, 2009

Prajarajyam election manifesto

ప్రజార్యాం ఎన్నికల ముసాయిదా ప్రధానాంశాలు


-సామాజిక న్యాయం, అవినీతి రహిత పాలన
- స్వయం సహాయక మహిళలకే రేషన్‌ షాపులు
-స్వయం సహాయక సంఘాలకు ఆరోగ్య జీవిత బీమా
-వంద రూపాయలకే వంట సామాగ్రి
-ఉద్యోగులకు గృహ నిర్మాణ రుణాలు రూ.10 లక్షలు
-ఉద్యోగులకు ఆరోగ్య కార్డుల జారీ
-దశల వారీగా మద్యపాన నిషేధం
- పెళ్లికి ముందే వధువరులకు ఎయిడ్‌‌స పరీక్షలు
-ప్రతి బిడ్డకు రూ. లక్షతో పసుపు, కుంకుమ పథకం
-నిరుద్యోగులకు వెయ్యి రూపాయలు నిరుద్యోగభృతి
-విజెలెన్‌‌స కమిషన్‌ ఏర్పాటు
-మావోలనుజనజీవన స్రవంతిలోకి తెచ్చే ప్రయత్నం
-ఆర్థిక నేరాల విచారణకు ప్రత్యేక విభాగం ఏర్పాటు
-రైతులకు గిట్టుబాటు ధరలకోసం రాష్ర్త స్థాయిలో వ్యవసాయధరల కమిషన్‌ ఏర్పాటు
-రైతులకు ప్రజా రైతు బంధు పథకం
-వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ కొనసాగింపు
-దరల స్థిరత్వంకోసం 500 కోట్లతో ప్రత్యేక నిధి
-గ్రామాల్లో గుడిసెలకు, బలహీన వర్గాల కాలనీలకు ఉచిత విద్యుత్‌
-చేతి వృత్తులు, కుటీరపరిశ్రమలకు ఉచిత విద్యుత్‌
-2020 నాటికి అందరికీ పక్కా ఇళ్లు
-గ్యాస్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు
-పక్కా ఇళ్ల యూనిట్‌ కాస్‌‌ట గ్రామాల్లో రూ.80 వేలు పట్టణాల్లో రూ.లక్షకు పెంపుదల
-ఎస్సీల్లో అన్ని వర్గాలను సంతృప్తి పరిచే శాస్త్రీయ వర్గీకరణకు ప్రత్యేక కమిటీ
-ఇబిసిలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు
కార్మికులకు ప్రత్యేక సంక్షేమ బోర్డు
బాలికలకు పిజి దాకా నిర్బంధ ఉచిత విద్య.

Wednesday, March 4, 2009

TDP IN REAL FIX

పార్టీ వీడి బయటకు పోయిన నాయకులకు టీడీపీ తిరిగి స్వాగతం పలుకుతోంది. తూళ్ల దేవేం దర్‌గౌడ్‌ను, ఆయనతో పాటు పెద్దిరెడ్డిని కూడా తిరిగి పార్టీలోకి తీసుకోవాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. బుధవారం జరిగిన టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అలాగే పార్టీ వీడి వెళ్లిన సీనియర్‌ నాయకుడు కళా వెంకట్రావు, తమ్మినేని సీతారాం, భూమానాగిరెడ్డి, శోభానాగిరెడ్డిలను కూడా తిరిగి పార్టీలోకి ఆహ్వానించాలనే విషయాన్ని పొలిట్‌బ్యూరో సమావేశంలో చర్చించినట్లు సమాచారం. 1985 నుంచి టీడీపీలో పని చేస్తున్న కార్యకర్తలు, నాయకులు కొందరు బయటకు పోయారని వారిని తిరిగి పార్టీలోకి తీసుకోవాలని నిర్ణయించిన్నట్లు పొలిట్‌ బ్యూరో సభ్యులు ఒకరు తెలిపారు.

ఈ నెల 15లోగా సిపిఎం సిపిఐ పార్టీలతో కలిసి సీట్లు సర్దుబాటు చేసుకోకపోతే ఆతర్వాత మహాకూటమితో సంబంధం లేకుండానే తమ పార్టీ అభ్యర్థుల జాబితా విడుదల చేయాలనే ఆలోచన కూడా పొలిట్‌బ్యూరోలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. తెలంగాణలో ఉన్న సీట్లు అన్ని కూడా వామపక్షలకు, టిఆర్‌ఎస్‌కు ఇవ్వడం వల్ల ఇక టీడీపికి సీట్లు మిగలవని, ఒక వేళ అన్ని సీట్లు వారికిచ్చినా అక్కడ కచ్చితంగా కాంగ్రెస్‌ పార్టీ గెలుస్తుం దని, కాబట్టి కామ్రేడ్ల గొంతెమ్మ కోర్కెలు తీర్చడానికి సంసిద్ధంగా ఉండకూడదని అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది.

శంకుస్థాపనలు అడ్డుకోవాలని నిర్ణయం

సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు అమలులోనికి వచ్చినా కూడా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కొత్త పనులు చేపట్టడానికి శంకుస్థాపనలు చేస్తున్నారని, పునాది రాళ్లు వేస్తున్నారని, దీనిని అడ్డుకోవాలని బుధవారం సమావేశం అయిన టీడీపీ పొలిట్‌బ్యూరో కమిటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పొలిట్‌బ్యూరో సభ్యుడు కడియం శ్రీహరి మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న ఆరాచకాలను నిలుపు దల చేసేలా చర్యలు తీసుకోవాలని, ఈ మేరకు ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేసి, జిల్లా కలెక్టర్లుకు ఆదేశాలు జారీ చేయనున్నామన్నారు. అలాగే ఎన్నికల మేనిఫెస్టో ముసాయిదాను ఒకటి రెండు రోజులలో విడుదల చేసి వాటిపైన ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత విడుదల చేస్తామని, ఆ విధంగా సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని కడియం తెలిపారు.

అయ్యా.. ధర్మం చేయండి

ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన ఆర్థిక మాంద్యం కారణంగా రానున్న ఎన్నికలలో అయ్యే ఖర్చుకు టీడీిపీ వెనకాడుతున్నట్లు తెలియవచ్చింది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని గద్దెదించాలంటే ఆ పార్టీ చేపట్టిన ప్రచారాన్ని ధీటుగా ఎదుర్కోవాలని, అందుకోసం డబ్బు సమకూర్చుకోవాలని చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ప్రజల నుంచి విరాళాలను సేకరించే ప్రయత్నం చేస్తున్నది. దీని వల్ల పార్టీ తరƒపున ఎన్నికల లో ఖర్చు పెట్టాలని పొలిట్‌బ్యూరో భావిస్తోంది. అయితే ఇందుకోసం ఒక వెబ్‌సైట్‌ ప్రారంభించారు. ఎవరైన దాతలు ఉంటే వారు ఈ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఐదు లక్షలు మాత్రమే ప్రజల నుంచి విరాళాలు వచ్చాయని, ఇంకా ఎన్ని కోట్లు రూపాయలు విరాళాలుగా వస్తాయో ఇప్పుడప్పుడే చెప్పలేమని నాయకులు తెలిపారు

Hi Guys lets get common symbol for PRP

Hi Guys,

Please request election commision to allot common symbol to PRP, its simple just copy paste the below msg and send the same to feedback@eci.gov.in and cc ceo_andhrapradesh@eci.gov.in

Let help chiru annaya to get the common symbol... Jai chiranjeevi ... jai PRP....



To

Mr. N. Gopalaswami

Chief Election Commissioner

Election Commission of India

Nirvachan Sadan,

Ashoka Road, New Delhi-110001



Subject: - Election symbol to Praja Rajyam Party

Dear Sir,

I would like to bring the following for consideration and favorable action.

I am a well wisher of Praja Rajyam Party in Andhra Pradesh, which has more than 50 Lakh registered members and the Party and its President Mr. Chiranjeevi has a huge following in rural areas of the state of Andhra Pradesh. Quite a few of these voters are either illiterate or semi-literate and therefore, rely on the symbol to cast their votes. Lack of a common symbol for the party is bound to confuse voters and deprive them of choosing the leader of their choice. In the absence of allocation of a common symbol, the voters' ignorance will cause undue advantage for other parties.

Again, the post election scenario of not having a single symbol could also open legal issues and validity of elected member's association to the party. Therefore, request the CEC to consider this appeal and grant the party with a dedicated single symbol.

Thank You in advance for considering this request.

Sincerely

An well-wisher of Praja Rajyam Party

Prajarajyam Candidates List

Prajarajyam candidates shortlist

Chiranjeevi Adilabad tour on March 6th

ప్రజారాజ్యం అధినేత చిరంజీవి ఈ నెల 6 నుంచి పశ్చిమ జిల్లాలో పర్యటించ…నున్నట్లు తెలిసిందే. అయితే పర్యటన వివరాలను మంగళవారం ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మేకల శ్రీనివాస్‌, జిల్లా కన్వీనర్‌ భూమన్న యాదవ్‌లు తెలిపారు. ఈనెల 6న ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌ నుంచి హెలిక్యాప్టర్‌లో నేరుగా ఖానాపూర్‌ చేరుకుంటారు. ఖానాపూర్‌ రోడ్‌ షోలో పాల్గొన్న అనంతరం అక్కడి నుండి మధ్యాహ్నం 12.30 నిమిషాలకు కడెం రోడ్‌ షోలో, తరువాత అక్కడి నుండి కడెం మండలం ఉడుంపూర్‌లో మధ్యాహ్నం భోజనం పూర్తి చేసుకుంటారు.

భోజనం అనంతరం 2.30 నిమిషాలకు ఉట్నూర్‌ రోడ్‌ షో, అక్కడి నుండి ఇంద్రవెల్లి చేరుకుని అమరవీరుల స్థూపాన్ని సందర్శించి నివాళులర్పీస్తారు. ముత్నూర్‌ సేవా గోండులలో రోడ్‌షోలు ముగించుకొని సాయంత్రం 6 గంటలకు ఆదిలాబాద్‌ చేరుకొని అక్కడ బహిరంగా సభలో జనవాహిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. రాత్రి అక్కడే బసచేసి 7న ఉదయం 11 గంటలకు గుడిహత్నుర్‌, ఇచ్చోడలో మధ్యాహ్నం 12 గంటలకు రోడ్‌షోలో పాల్గొంటారు.మధ్యాహ్నం బజార్‌హత్నుర్‌ మండలం సోనాలలో మధ్యాహ్న భోజనం చేస్తారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు బోధ్‌, 5.30 నిమిషాలకు నేరడిగోండ, వాంకిడి రోడ్‌షోలు పూర్తి చేసుకొని రాత్రి 7 గంటలకు నిర్మల్‌ చేరుకొని బహిరంగ సభనుద్దేశించి ప్రసంగిస్తారు. ఇక్కడి నుంచి తిరిగి హైదరాబాద్‌ వెళ్తారు

Settlers in hyderabad on Prajarajyam

సెటిలర్‌‌స చూపు పీఆర్పీ వైపు...

సామాజిక న్యాయం, మార్పు నినాదంతో ప్రజల ముందుకు వచ్చిన ప్రజారాజ్యంపార్టీ తెలంగాణ అంశంతో నగరంలోని సెటి లర్‌‌సను ఆకర్శిస్తున్నది. తెలంగాణ అంటే టీఆర్‌ఎస్‌ అన్న భావనను తొలగించడానికి హైదరాబాద్‌ సెటిలర్‌‌స ఓటర్లు అధికంగా ఉన్న నియోజకవర్గాలను ఎంచుకుని వి„స్తృ తంగా ప్రచారం చేసేందుకు వ్యూహాలు రూపొం దిస్తున్నది. సామాజిక తెలంగాణ సాధన లక్ష్యంగా దేవేందర్‌గౌడ్‌ స్థాపించిన నవ తెలంగాణ పార్టీని ప్రజారాజ్యంలో విలీనం చేయడంతో ఈ నినాదం మరింతగా ఊపందుకుంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో పలు రాషా్టల్రతో పాటు, వివిధ జిల్లాల నుంచి విద్య, ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం లక్షలాది మంది కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్‌ నియోజకవర్గాల్లో స్థిరపడ్డారు.

నగరంలో స్థిరపడ్డ వారు ఏ జిల్లావారైనా, ఏ రాషా్టన్రికి చెందిన వారైనా తెలంగాణ పౌరులే అన్న భద్రతా భావాన్ని వారిలో కల్పించడానికి ఆ పార్టీ నియోజకవర్గాల స్థాయి బహిరంగ సభలకు బుధవా రంతో శ్రీకారం చుట్టింది. తెలంగాణ అంశం సామాజిక న్యాయం నినాదాలతో ప్రజారాజ్యం వచ్చే ఎన్నికల్లో నగరంలో చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లను గెలుచుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు

Prajarajyam samajika nayam sankaravam

ప్రజారాజ్యం సామాజిక న్యాయ శంఖారవం..!!


ఆత్మగౌరవం రాజ్యాధికారం మార్పు లక్ష్యంగా సామాజిక న్యాయ శంఖారావ సదస్సు నిర్వహించనున్నట్టు ప్రజా రాజ్యం పార్టి అధికార ప్రతినిధి తమ్మినేనిసీతారాం వెల్లడించా రు. బుధవారం ప్రజారాజ్యం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఎర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజమండ్రి వేదికగా జరగనున్న ఈ సదస్సును విజయవంతం చేసేందుకు ఈనెల పదోతేదిన ఛలో రాజమండ్రి కార్యక్రమానికి పిలుపు నిచ్చినట్టు పేర్కొన్నారు.

పార్టీ అధ్యక్షులు చిరంజీవి పాల్గొనే ఈకార్యక్రమానికి సుమారు పది లక్షలమంది హాజరవు తారని అంచనా వేస్తున్నామన్నారు. జాతి సంపదను సమాజంలోని అన్ని వర్గాల వారికి సమానంగా అందించాలన్నదే ప్రజారాజ్యంపార్టీ లక్ష్యంగా పేర్కొన్నారు. మహాకూటమి పరిస్థితి రోజురోజుకు దిగజారు తోందన్నారు. కూటమికి ఉమ్మడి ఎజెండావుందా ఉంటే అది ప్రజలముందు పెట్టాలని డిమాండ్‌ చేశారు.మరోవైపు సిపిఎంకు ఎజెండా లేదని రాఘవులే చెబుతున్నారన్నారు. కూటమిపార్టీల్లో ఎవరు ఎవరికి సీట్లు కేటాయిస్తున్నారో స్పష్టం చేయాలన్నారు. ప్రత్యేక తెలంగాణ, పోలవరం, వంటివాటిపై మ„హాకూటమి వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశా రు.పైరవీలతో బతికే ఎర్రంనాయుడే ఊసరవెళ్ళి అని తమ్మినేని ఆరోపించారు.

ACB filed case against chief minister Y S Rajasekhara Reddy

HYDERABAD: The Anti-Corruption Bureau here has been ordered to register a case against Andhra Pradesh chief minister Y S Rajasekhara Reddy,

irrigation minister Ponnala Lakshmaiah and nine others for alleged misappropriation of public funds.

In a case related to the controversial Yellampalli irrigation project, a special
courtof the Bureau directed the ACB Director General on Friday to conduct a detailed investigation into the allegations and submit a report to it by March 26.

The order came after hearing arguments on a petition filed by a city-based
lawyerV Srinivasa Rao with the ACB special court alleging that the ACB DG had failed to act on his complaint, filed on January 24, on the Yellampalli project and requesting that necessary directions be issued for registration of a case against the chief minister and others.

The ACB special court judge N Sanyasi Rao has directed the ACB DG to register a case under Section 13 (1) (d) of the Prevention of Corruption Act and Sections 120 (B) (conspiracy), 167 (misuse of official position by public servants), 201 (screening of evidence) and 409 (criminal breach of trust by public servants) and that a detailed investigation be conducted against the chief minister and others.